I serve you

Blog

  • https://t.me/vkutumbarao

    My all books on spoken English are here ( Telegram group) for free.

  • Notice board

    Namaste
    I am Dr. Viswanatha Kutumbarao, a Sanskrit lecturer for the past 30 years. I studied indian mythologies and epics. I can give lectures on devotion, spirituality, personality development and motivation. If anyone wants for school students or person to person motivational classes, can text to my WhatsApp number – 8639849483.
    It is my free service and available after 5.00 p.m.

  • Sanskrit

    http://www.devabhasha.com

    For free spoken Sanskrit lessons.

  • విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంలో కొన్ని ముఖ్య విషయాలు


    వ్యక్తిత్వ వికాసం కొరకు విద్యార్థులకు కొన్ని సూచనలు….


    1. సృజనాత్మకత – మంచి కథల పుస్తకాలు, రామాయణ మహాభారత పుస్తకాలు చదవడం వల్ల, గొప్పవాళ్ళ చరిత్రలు తెలుసుకోవడం వల్ల సృజనాత్మకత వస్తుంది.
    2. నమస్కారం – ప్రతిరోజు తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు నమస్కారం చేయడం వల్ల ఆ రోజు వచ్చే గండాలు తొలగిపోతాయి. నమస్కారం చేసిన సమయం నుంచి రాబోయే 24 గంటల్లో మనకు సంభవించే ప్రమాదాల్లో మన ప్రాణం పోకుండా నిలబడుతుంది. మరియు
      కార్యాలయాల్లో ఉన్నతాధికారులకు నమస్కారం చేయడంవలన మన పనులు త్వరగా నెరవేరతాయి. మరియు నమస్కారం చేయడంవల్ల మనం మంచివాళ్ళమని అందరూ అనుకుంటారు.
    3. దేవుని ఎలా ప్రార్థించాలి – మనం ప్రతిరోజు ” నా కష్టాలు పోగొట్టుస్వామి, నాకు సద్భుద్దిని ప్రసాదించు స్వామి” అని మాత్రమే భగవంతుని ప్రార్థించాలి. మనకు ఏమి ఇవ్వాలో భగవంతునికి  తెలుసు. మనకు అవసరమైనదే ఇస్తాడు. అపాయాన్ని కలిగించేది అయితే ఎంత ప్రార్ధించినా దానిని ఇవ్వడు.
    4. తెలివితేటలు రావడానికి –
      పిల్లల తెలివితేటలు అభివృద్ధి చెందాలంటే, చదువులో బాగా రాణించాలంటే దైవకృప అవసరం. ” శివాయ గురవే నమః” అని ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తరువాత మనస్సులో అయినా సరే 108 సార్లు ప్రార్థిస్తే తప్పక ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కేవలం 6 నెలలు ఇలా చేయాలి.
    5. ఆత్మహత్య మహాపాపం – ఒక మనిషి ఆత్మహత్య చేసుకొంటే, అతడు ఈజన్మలో అనుభవించాల్సిన కష్టాలు,అతను చనిపోవడం వలన ఎంతమంది ఎన్ని రోజులపాటు బాధపడతారో ఆబాధలు, ఎంతమంది ఎన్ని కష్టాలు అనుభవిస్తారో ఆ కష్టాలు, వీటిని మరియు ఆవ్యక్తి కిందటి జన్మలో చేసిన పాపాల్లోంచి కొన్ని పాపాలను బాధలరూపంలోనూ, ఇలా బ్రహ్మ అన్నింటినీ కలిపి ఆ వ్యక్తికి రాబోయే జన్మలో అనుభవింపచేస్తాడు.అందువల్ల ఆత్మహత్య చేసుకున్నవ్యక్తి రాబోయే జన్మలో మహాబాధలు పడేవానిగా జన్మిస్తాడు.
    6. సూక్తులు – ఉపయోగాలు – సు అనగా మంచి. “ఉక్తి” అనగా మాట. “మంచిమాట” అని అర్థం. అలాగే “సు” అంటే మంచి,”భాషితం” అంటే చెప్పబడినది. మంచిగా చెప్పబడినది అని అర్థము. పూర్వకాలంలో చాలామంది మహానుభావులు తమ జీవితం చివరలో తమ అనుభవాలను ఓకే ఒక వాక్యంలో చెప్పారు.అనుభవంతో చెప్పిన మాటలే సూక్తులు లేక సుభాషితాలు. ఆ సూక్తులను మనము మన జీవితంలో ఆచరిస్తే వారుపొందిన సుఖాలను పొందుతాము.పాటించకపోతే వారుపడిన కష్టాలను పొందుతాము. మన జీవన ప్రయాణంలో ఎదురొచ్చే కష్టాలను, ప్రమాదాలను,సమస్యలను వారి అనుభవాల సాయంతో ఎదుర్కోవచ్చు.వారిచేసిన మంచిపనులను మనం చేసి కీర్తిప్రతిష్టలను,ధనాన్ని,సుఖవంతమైన జీవితాన్ని పొందవచ్చు. కనీసం వంద సూక్తులను పాటిస్తే విద్యార్థులు ఆదర్శపౌరులు అవుతారు.అవే సుమతీ శతకం,వేమన శతకం మొదలైనవి.
    7. మనపొరపాట్లను సరిదిద్దుకోవడం ఎలా? –
      తెలిసో,తెలియకో, అమాయకత్వంవల్లనో,అజ్ఞానంవల్లో పొరపాట్లను మనం చేస్తుంటాము. ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు ఐదు నిమిషాలపాటు ఆరోజు మనం చేసిన పనులను గుర్తుకు తెచ్చుకోవాలి. అప్పుడు మనం చేసిన పొరపాట్లు మనకు తెలుస్తాయి. ఆ సమయంలో మనం మన ఇష్టదైవాన్ని “స్వామీ ఈ రోజు చేసిన పొరపాట్లను,తప్పులను రేపు నేను చేయకుండా చేయి స్వామీ” అని మనస్పూర్తిగా ఒక్కసారి ప్రార్థిస్తే మరునాడు ఆ పొరపాట్లను చేయము.
    8. పాఠాలు త్వరగా అర్థం కావాలంటే –
      విద్యార్థులు ప్రతిరోజు రాత్రి పదిగంటలకు పడుకొని తెల్లవారిఝామున 4.00 గంటలనుండి 6.00 వరకు చదవాలి. అప్పుడు శరీరం పూర్తిగా విశ్రాంతి పొంది వుంటుంది. ప్రకృతి చల్లగా, ఆహ్లాదంగా వుంటుంది. యోగులు ఆ సమయంలో ధ్యానం చేస్తుంటారు. వారి భావనా తరంగాలు అంతటా వ్యాపిస్తాయి.మన మనస్సు ఆ సమయంలో పాదరసం లాగా వేగంగా పనిచేస్తుంది. ఎంతపెద్ద కఠిన పాఠమైనా అప్పుడు త్వరగా అర్థమవుతుంది.కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్తాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని చదువులో ముందుండాలి.
      9.అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి –
      సాయంకాలం సంధ్యా సమయంలో విద్యార్థులు ఆకాశంలో ఏర్పడే వివిధ ఆకారాల్లో ఏర్పడే ఎర్రని మేఘాలను చూడాలి. తద్వారా గొప్ప ఆనందం కలుగుతుంది.ఆ తరువాత ఆకాశాన్ని పర్యవేక్షించాలి. అలా చేయడంవలన విద్యార్థుల్లో వివేచన కలిగి ” ఈ అనంత ఆకాశంలో మన భూమి ఎంత? అందులో మనదేశం ఎంత? మన రాష్ట్రం ఎంత? దాన్లో మన వూరు ఎంత? నాకున్న కొద్దిపాటి జ్ఞానానికే నేను గర్వించవలసిన అవసరం లేదు అని ” ఇలా ఆలోచించడం వలన పిల్లల్లో ప్రారంభదశలో వున్న అహంకారం తొలగిపోతుంది.
    9. విద్యార్థి విజేతగా ఎప్పుడు మారతాడు –
      అనుభవజ్ఞుని ప్రేరణ మాటలతో బద్ధకం పోయి జ్ఞానోదయం అవుతుంది. అనగా తన కర్తవ్యం చేయాలనే ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతో పట్టుదల వస్తుంది. పట్టుదల వలన ప్రణాళిక సిద్ధమవుతుంది. పకడ్బందీ ప్రణాళికతో పని ప్రారంభించబడుతుంది. చివరకు విద్యార్థి విజయుడు అవుతాడు.
      అనగా…
    • జీవితానికి ఒక కచ్చితమైన లక్ష్యం.
    • దాన్ని సాధించగలననే నమ్మకం.
    • తప్పక సాధించే తీరాలన్న పట్టుదల.
    • సాధించడానికి ఒక పకడ్బందీ ప్రణాళిక.
    • సాధించే వరకు నిరంతర కృషి.
      అప్పుడే విద్య ప్రతి విద్యార్థి విజేతగా నిలుస్తాడు.
    1. భగవంతుడు మనకు తోడుగా ఉండాలంటే –
      భగవంతుడు ధర్మపక్షపాతి. ధర్మం ఎక్కడుంటే భగవంతుడు అక్కడ ఉంటాడు. అందుకే పాండవులు ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు కాబట్టి ధర్మపక్షపాతి అయిన భగవంతుడు వాళ్లతోనే ఉన్నాడు. అధర్మాన్ని ఆచరించే కౌరవుల పక్షాన కృష్ణుడు ఉండలేదు.
    2. భగవద్గీత చదవడం వల్ల ఉపయోగాలు –
      భగవంతుడైన కృష్ణుడు మనకు కర్తవ్యాన్ని బోధించాడు. రోజు రెండు శ్లోకాలను పిల్లలకు నేర్పించండి. భగవద్గీత చదివితే ఉద్యోగాలను ఒక సర్వీస్ లాగా చేయాలని తెలుస్తుంది. ఇది ఉత్తమ జీవన విధానమును తెలియజేస్తుంది. దీనిని చదవడం ద్వారా మంచి వ్యక్తులుగా అవుతారు. స్ట్రెస్ లేని జీవితం ఇది ఇస్తుంది. మంచితనం అలబడుతుంది. కోపం రాదు. ఎలాంటి సందేహాలు రావు. ఆత్మశక్తి వస్తుంది. ఎంత వినాలో తెలుస్తుంది. ఏమి తినాలో చెబుతుంది. ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది.పెద్దల్ని గౌరవించడం, గురువుల్ని గౌరవించడం తెలుపుతుంది. కృతజ్ఞత చూపించటం తెలియజేస్తుంది. అందుకే ” కృష్ణం వందే జగద్గురుమ్” అని అన్నారు. మరియు రాముడు చేసింది చేయాలి. కృష్ణుడు చెప్పింది చేయాలి అని కూడా అన్నారు.
      13.మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రోత్సహించుకోండి –
    • ఇతరులు చేయగలిగితే నేను కూడా చేయగలను.
    • నేర్చుకోవడం అనేది నాకు ఒక ఆట లాంటిది.
    • నా జీవితం నా చేతుల్లోనే ఉంది.
    • నేను చాలా తెలివైన వాడిని చురుకైనవాడిని, జీనియస్ ని, టాలెంటు ఉన్నవాడిని.
    • నేనెప్పుడూ విజయతనే. నాకు ఎదురులేదు.
    1. విద్యార్థులు గుర్తించుకోవలసిన కొన్ని ముఖ్య విషయములు –
    • గురువు దగ్గర పరిప్రశ్న  ఉండాలి. అనగా గురువుని శిష్యులు వినయముతో సమాధానముల కొరకు అడగాలి.
    • జ్ఞానం గురువు యొక్క లక్షణం.
    • మనల్ని అజ్ఞానం నుంచి బయట పెట్టడంలో సమర్థుడు గురువే.
    • మన బుద్ధియే మన గురువు.
    • మనోవికాసము కలగాలంటే జ్ఞాన సముపార్జన చేయాలి. జ్ఞానము వల్లనే మనసు వికసిస్తుంది.
    • కావున జ్ఞాన సమపార్జునుకు గురుసేవ ఒక్కటే మార్గము.
    • గురు బోధలేని విద్య లాభించదు.
    • బాధ్యత తెలిస్తే బద్ధకం పోతుంది.
    • మొదట ఏ పని అయినను చేతకాకపోయినా చేయగా చేయగా చేయి తిరిగి నైపుణ్యం వస్తుంది.
    • ప్రతి విద్యార్థి నేర్పుతో చక్కగా మృదు మధురంగా మాట్లాడటం నేర్చుకోవలెను. చక్కగా మాట్లాడటం కూడా ఒక కళయే.
    • విజ్ఞానమే అన్నింటికీ మూలాధారము అందుకే knowledge power అని చెప్పారు.
    • జ్ఞానులు చెప్పింది జాగ్రత్తగా వినినప్పుడే మనము కూడా జ్ఞానులము అవుతాము.
    • శ్రమ కలిగినను భరించవలెను. ఆలస్యమైనను సహించవలెను. అలా చేసినచో చెడిపోయిన పనులు కూడా నెరవేరతాయి.
    • వివేకవంతుడు అనగా ఆలోచించి పనులు చేసేవాడు.
    • మంచి చెడులు గుర్తించు వివేకమును ఇవ్వని చదువు వ్యర్థము.
    • ప్రతి మనిషీ దైవ స్వరూపుడే. తోటివారికి సహాయం చేస్తే అది భగవంతునికి సేవ చేసినట్లే అవుతుంది. అందుకే ” దైవం మానుష రూపేణ” మరియు “మానవసేవే మాధవసేవ” అని అన్నారు.
    • ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.
    • ధైర్యవంతుడే బలవంతుడు. మరియు భక్తుడే బలవంతుడు. ఎందుకంటే భక్తునిలో ఉండేది భగవంతుడే కనుక.
    • ఈ పనిని నేను ఎందుకు ఇప్పుడు చేస్తున్నాను? దీనివలన లాభము ఏమిటి? అని ప్రతి విద్యార్థి నిరంతరం ప్రశ్నించుకోవాలి.
    • విద్యతోపాటు సత్ప్రవర్తన కూడా బాల్యంలోనే విద్యార్థులు నేర్చుకోవాలి.
    • మేధావి అయినవాడు ఎన్ని కష్టములు పడినను శుద్ధమైన నడవడికను, జీవనమును కలిగి ఉండవలెను. తద్వారా అతడు ప్రతిష్టను పొందుతాడు. ఉత్తమ గతులను కూడా పొందును.
    • ప్రతి విద్యార్థి నేను ఏమవుతాను అనుకోకుండా నేను నా దేశానికి ఏమి చేస్తాను అని ఆలోచించాలి.
    • చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు లక్ష్యసిద్ధికి కావలసినవి.
    • పరమాత్మ ప్రకృతి ద్వారానే మనకు పాఠం నేర్పుతాడు. ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటన ఒక్కొక్క పాఠము.
    • విద్యార్థులూ మీకు చేసే పనిపై స్పష్టత ఉండాలి. స్పష్టత లేకపోతే జీవితం అయోమయం అవుతుంది.
    • క్లాసులు వింటే వ్యక్తిత్వ వికసనం రాదు. జీవితంలో మంచి పనులు చేస్తే వస్తుంది.
    • విజయం సాధించాలంటే మొదట చేసే పనిని ప్రేమించాలి – మోక్షగుండం విశ్వేశ్వరయ్య
    • మనస్ఫూర్తిగా పనిచేయని వాడు జీవితంలో విజయాన్ని సాధించలేడు – అబ్దుల్ కలాం గారు.
    • కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి – అబ్దుల్ కలాం గారు
    • ఉత్తములు ఆత్మవిమర్శ చేసుకుని తమని తాము దిద్దుకుంటారు. అధములు మాత్రం పరనింద చేస్తూ దిగజారుతుంటారు – రామకృష్ణ పరమహంస గారు
    • ప్రోత్సాహం లేదని మంచి పనిని వాయిదా వేయకండి – మదర్ తెరిసా
    • గుర్తుంచుకోండి – పరిస్థితులు అనేవి మనిషి అధీనంలో ఉండవు. కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు – వివేకానంద గారు
    • విజయం అడ్డుదోవలో రాదు అని గుర్తుపెట్టుకోండి” success has no short cuts.”
    • Everybody was born genius. అందుకే ఎలా బతకాలి అని ప్రతి మనిషి తనకంటూ ఒక ఫార్మేట్ తయారు చేసుకోవాలి సక్సెస్ కు.
    • it is a social responsibility. If a home is good society will be good. If society is good the whole nation will be good.
      ఇట్లు మీ మిత్రుడు
    • విశ్వనాథ కుటుంబరావు

Create your own website, free on WordPress.com. Create your own website.
Start free
Build a Mobile Site
View Site in Mobile | Classic
Share by: